మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

 

Sri Sudarshana Ashtottara Shatanama Stotram – శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రం


సుదర్శనశ్చక్రరాజః తేజోవ్యూహో మహాద్యుతిః |
సహస్రబాహుర్దీప్తాంగః అరుణాక్షః ప్రతాపవాన్ || 1 ||

అనేకాదిత్యసంకాశః ప్రోద్యజ్జ్వాలాభిరంజితః |
సౌదామినీసహస్రాభో మణికుండలశోభితః || 2 ||

పంచభూతమనోరూపో షట్కోణాంతరసంస్థితః |
హరాంతఃకరణోద్భూతరోషభీషణవిగ్రహః || 3 ||

హరిపాణిలసత్పద్మవిహారారమనోహరః |
శ్రాకారరూపః సర్వజ్ఞః సర్వలోకార్చితప్రభుః || 4 ||

చతుర్దశసహస్రారః చతుర్వేదమయోఽనలః |
భక్తచాంద్రమసజ్యోతిః భవరోగవినాశకః || 5 ||

రేఫాత్మకో మకారశ్చ రక్షోసృగ్రూషితాంగకః |
సర్వదైత్యగ్రీవనాలవిభేదనమహాగజః || 6 ||

భీమదంష్ట్రోజ్జ్వలాకారో భీమకర్మా త్రిలోచనః |
నీలవర్త్మా నిత్యసుఖో నిర్మలశ్రీర్నిరంజనః || 7 ||

రక్తమాల్యాంబరధరో రక్తచందనరూషితః |
రజోగుణాకృతిః శూరో రక్షఃకులయమోపమః || 8 ||

నిత్యక్షేమకరః ప్రాజ్ఞః పాషండజనఖండనః |
నారాయణాజ్ఞానువర్తీ నైగమాంతఃప్రకాశకః || 9 ||

బలినందనదోర్దండఖండనో విజయాకృతిః |
మిత్రభావీ సర్వమయో తమోవిధ్వంసకస్తథా || 10 ||

రజస్సత్త్వతమోద్వర్తీ త్రిగుణాత్మా త్రిలోకధృత్ |
హరిమాయాగుణోపేతో అవ్యయోఽక్షస్వరూపభాక్ || 11 ||

పరమాత్మా పరంజ్యోతిః పంచకృత్యపరాయణః |
జ్ఞానశక్తిబలైశ్వర్యవీర్యతేజఃప్రభామయః || 12 ||

సదసత్పరమః పూర్ణో వాఙ్మయో వరదోఽచ్యుతః |
జీవో గురుర్హంసరూపః పంచాశత్పీఠరూపకః || 13 ||

మాతృకామండలాధ్యక్షో మధుధ్వంసీ మనోమయః |
బుద్ధిరూపశ్చిత్తసాక్షీ సారో హంసాక్షరద్వయః || 14 ||

మంత్రయంత్రప్రభావజ్ఞో మంత్రయంత్రమయో విభుః |
స్రష్టా క్రియాస్పదః శుద్ధః ఆధారశ్చక్రరూపకః || 15 ||

నిరాయుధో హ్యసంరంభః సర్వాయుధసమన్వితః |
ఓంకారరూపీ పూర్ణాత్మా ఆంకారఃసాధ్యబంధనః || 16 ||

ఐంకారో వాక్ప్రదో వాగ్మీ శ్రీంకారైశ్వర్యవర్ధనః |
క్లీంకారమోహనాకారో హుంఫట్‍క్షోభణాకృతిః || 17 ||

ఇంద్రార్చితమనోవేగో ధరణీభారనాశకః |
వీరారాధ్యో విశ్వరూపో వైష్ణవో విష్ణురూపకః || 18 ||

సత్యవ్రతః సత్యపరః సత్యధర్మానుషంగకః |
నారాయణకృపావ్యూహతేజశ్చక్రః సుదర్శనః || 19 ||

ఇతి శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |


 

 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.